Tamota Sharbhat Recipe
టమోటా షర్బత్
కావలిసినవి:
టమోటా రసం 1 గ్లాస్
పంచదార 1 గ్లాస్
తయారీ విధానం:
- టమోటాలు పుల్లటివి తీసుకొని ఒక గ్లాస్ రసం లోకి 2 గ్లాసుల పంచదార పోసుకోవచ్చు. తీయటివి అయితే 1 గ్లాస్ పంచదార సరిపోతుంది. ఇది గమనించ గలరు.
- టమోటా పండ్లు శుభ్రం గా కడిగి పొడి బట్టతో తుడిచి మధ్యకు కోసి ఒక గాజు సీసాలో బాగా పిసకాలి.
- టమోటా గుజ్జు ఒక మంద పాటి గుడ్డ లో వేసి రసం పిండాలి.
- రసం 1 గ్లాసు లో కొలిచి 1 గ్లాస్ పంచదార పోసి ఒక 1/2 గ్లాస్ మంచి నీళ్లు పోసీ తీగ పాకం పట్టుకోవాలి.
- తీగ పాకం వచ్చిన తరువాత రసం పోసి కలియబెట్టి దించుకోవాలి.
- దించి చల్లార్చిన తరువాత ఒక పొడి గాజు సీసాలో పోసుకోవాలి.
- సర్వ్ చేసుకునేటప్పుడు 1 గ్లాస్ మంచి నీళ్లలో 2 స్పూన్ పాకం వేసుకొని ఐస్ ముక్కలు కలిపి సెర్ప్ చేసుకోవాలి.