Mango Sharbhath Recipe

 మాంగో షర్బత్ 

కావలిసినవి:

1 గ్లాస్ లో పుల్లటి మామిడికాయ రసం
ఉప్పు 1 స్పూన్ 
పంచదార 3 గ్లాసులు 
మంచి నీళ్లు 1/2 గ్లాస్ 

తయారీ విధానం:

  1. మామిడి కాయలు శుభ్రంగా కడిగి వాటిని తుడిచి పైన మామిడి కాయ చెక్కు తీసి తురుముకోవాలి. 
  2. తురిమిన మామిడికాయలో ఉప్పు వేసి పిసికితే రసం ఊరి వస్తుంది. 
  3. పల్చని గుడ్డ లో రసం పిండుకోవాలి.  మామిడి రసం ఒక గిన్నెలో తీసుకొని. 
  4. పంచదార 3 గ్లాసులు కి మంచి నీళ్లు 1/2 గ్లాస్ పోసుకొని తీగ పాకం వచ్చిన తరువాత మామిడిరసం పోయాలి. ఒక 5 నిముషాలు ఉడకనివ్వాలి. 
  5. చల్లారిన తరువాత పొడిగా ఉన్న సీసాలో కి తీసుకోవాలి. 
  6. సర్వ్ చేసుకొనేటప్పుడు 1 గ్లాస్ మంచి నీళ్లలో 2 స్పూన్ల పాకం వేసుకొని కొంచెం ఐస్ ముక్కలు వేసి మాంగో ఎసెన్సు వేసి సర్వ్ చేసుకోవాలి. 
Powered by Blogger.