Ice Cream Method of preparation Recipe
ఐస్ క్రీమ్
కావలిసినవి :
ఐస్ క్రీమ్ పౌడర్ 1 ప్యాకెట్ నీరు, పంచదార,జీడిపప్పు,యలికలు పొడి.
తయారు చేయు విధానము:
- పదహారు ఔన్సుల నీరు ఒక గిన్నెలో పోసి,తెర్లుటున్నట్లు పాకెట్లో పొడి వేసి, స్పూన్ తో బాగా కలియబెట్టాలి..
- పొడి కిలిపిన నీరు మజ్జిగ మాదిరి వెనిలా ప్లేవర్తో ఉంటుంది. నీరు మరిగిన తరువాత దించి ఎగ్బీటర్ తో గాని, మజ్జిగ కవ్వంతో చిలకాలి.
- నురుగు వచ్చిన తరువాత మూతపెట్టి బాగా చల్లారిన తరువాత ట్రై లో పోసి, డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టాలి.
- రెండు గంటల తరువాత ఐస్ క్రీం బాగా గట్టి పడుతుంది. దాని తీసి స్పూన్ తో బాగా చిలక్కొడితే ఐస్ క్రీం ముద్ద అవుతుంది. పైన జీడిపప్పు, యలికలు పొడి చల్లి సర్వ్ చేయాలి.