Fruit Plan Recipe: ఫ్రూట్ ప్లాన్ పూడింగ్ తయారీవిధానం

 ఫ్రూట్ ప్లాన్ పూడింగ్ తయారీవిధానం:

కావలిసినవి:

  1. మైదా పిండి 150 గ్రాములు 
  2. ఉప్పు 1/2 స్పూన్ 
  3. కాక్టెయిల్ ఫ్రూట్ 1 డబ్బా 
  4. క్రీమ్ 1 కప్పు 
  5. చెర్రీస్ వెనిలా ఎసెన్స్ 1/2 స్పూన్ 
  6. నెయ్యి  50 గ్రాములు 
  7. పాలగుండ 1 స్పూన్ 
  8. పంచదార 10 గ్రాములు 
  9. పసుపు మిఠాయి రంగు 1/2 స్పూన్ 

తయారీ విధానం:

  • మైదా జల్లించి దానిలో ఉప్పు వేసి నెయ్యి పోసి ముద్దగా కలుపుకోవాలి. 
  • ఈ ముద్ద కొంచెం పొడిగా కొంచెం తడిగా ఉంటుంది. ఇందులో చల్లటి నీళ్లుపోసి పూర్తి ముద్దలా కలుపుకోవాలి 
  • మీకు కావలిసిన సైజు లో రోల్ చేసుకోవాలి. అంచుల చక్కగా సరిచేసి కొని ఉంచుకోవాలి. మిగిలిన పిండిని ప్లాన్ తయారు చేయటానికి ఉంచాలి. 
  • ప్లాను అంటే రోల్ చేసిన పిండిని మధ్యలో రంద్రం చేయాలి. 
  • బేకింగ్ ట్రే లో బట్టర్ పేపరువేసి ఈ మిశ్రమం ఉంచి పైన ఎండు బఠాణి ఉంచి ఒక 10 నిముషాల పాటు ఒవేన్ లో 425 వేడి దగ్గర బేక్ చేసుకోవాలి. 
  • బట్టర్ పేపర్ బఠాణి తీసేసి మరల ఒక 5 నిమిషాల పాటు బేక్ చేసి తీసేసి చల్లార్చాలి. 
  • పాలగుండ  అరకప్పు చల్లనీళ్ళలో కలిపి ఉంచాలి. 
  • ఫ్రూట్ జ్యూస్ వేడి చేసి అందులో పాలగుండ పోసి సాస్ తయ్యార్ అయ్యేంత వరకు ఉడికించాలి. 
  • ఉడికిన తరువాత మిఠాయి రంగు వెనిలా ఎస్సెన్ పంచదార కలపాలి. 
  • ఒక కప్పు పంచదార 1/2 కప్పు అందులో వెన్న బాగా గిలకొట్టి క్రీమ్ తయారు చేసుకోని ఉంచుకోవాలి. 
  • కాక్టెయిల్ ఫ్రూట్ ఓడ్చి ప్లానులో ఉంచాలి. 
  • ప్లానుమీద ఫ్రూట్ పెట్టి క్రీమ్ పోసి పైన చెర్రీస్ పెట్టి అల్లంకరించుకోవాలి. 
  • సర్వ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. 
Powered by Blogger.