కావలిసినవి:
- వెన్న ఒక 60 గ్రాములు
- పంచదార 60 గ్రాములు
- గోధుమపిండి 50 గ్రాములు
- అరటిపండు 2
- పాలు 3/4 కప్పు
- కోడి గ్రుడ్డు 2
తయారీ విధానం:
- వెన్న గోధుమ పిండి పాలు బాగా చిలికి సన్నని సెగపై బాగా చిక్కగా ఉడకనివ్వాలి.
- కోడి గ్రుడ్డు పగల కొట్టి దానిలో పచ్చ సోనా ఉడికిన పిండిలో దించిన తరువాత కలుపుకోవాలి, తరువాత బాగా చిలికి అరటి పండు ముక్కలు తరిగీ కలుపుకోవాలి.
- బేకింగ్ టిన్ లో పోసి ఒక 20 నిముషాలు బేక్ చేసుకోవాలి.
- కోడి గ్రుడ్డు లోని తెల్ల సోనా పంచదార పొడి 1 స్పూన్ బాగా చిలికి పూడింగ్ పైన పోసుకొని గోధుమరంగు వచ్చే వరకు బేక్ చేసుకొని తీయాలి.
bananna pooding recipe:బనానా పూడింగ్
Reviewed by
Lucky
on
March 15, 2025
Rating:
5