fruit ice cream Method of preparation
fruit ice cream Method of preparation
కావలిసినవి:
ఐస్క్రీమ్ పౌడర్ 1ప్యాకెట్
పాలు 1 కప్పు
నీరు 1 కప్పు
పంచదార 1 కప్పు
జీడిపప్పు 1/4 కప్పు
యలికలు 10
అరటిపండు 1
యాపిల్ 1
జామపండు 1
పైనాపిల్ 1/2 ముక్క
తయారీవిధానం:
బజార్ లో దొరికే ఐస్క్రీమ్ పౌడర్ తీసుకోని పాలల్లో కలిపి పేస్టులా తయారుచేయాలి.
నీరు (4కప్పులు ) స్టవ్ మీద మరిగిన తరువాత పాలల్లో కలిపిన ఐస్ క్రీం పొడి వేసి గరిటతో బాగా కలియబెడుతూ ఉండాలి.
బాగా మందంగా చిక్కగా అయినా తరువాత పంచదార యలికలు పొడి . ముక్కలు చేసిన జీడిపప్పు వేసి బాగా చిక్కగా ఉడకనివ్వాలి.
ఉడికిన తరువాత దించి, చల్లార్చి డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టి, కొంచెం గట్టిగా అయినా మజ్జిగ కవ్వంతో గాని ఎగ్ బీటర్తో గాని చిలికితే ముద్దగా అవుతుంది.
తరిగిన పండ్లు ముక్కలు ఐస్ క్రీమ్ పైన వేసి సర్వే చేయాలి.