cheese ice cream method of preparation recipe
cheese ice cream method of preparation recipe
కావలిసినవి:
పాలు 2 కప్పులు
పంచదార 1 కప్పు
నీరు 1 1/2 కప్పు
జొన్నపిండి 1 స్పూన్
జున్ను 3/4 కప్పు
బాదంపప్పు 1/4 కప్పు
పిస్తా 1/4 కప్పు
తయారీచేయువిధానం:
1. పాలు బాగా చిక్కగా అయ్యేంతవరకు కాచాలి. జొన్నపిండిని 1/2 కప్పు పాలలో కలిపి వుంచాలి .
2. పంచదార,నీరు కలిపి,కలిపి తీగపాకం పట్టుకోవాలి.
3. పాకంలో తరిగిన జున్నును కలిపి, కలియబెడుతూ ఉంచాలి.
4. పాకంలో చిక్కబడిన పాలు పోసి కొంచెం సేపు గరిటతో కలుపుతూ ఉండాలి.
5. బాగా చిక్కబడిన తరువాత ట్రేలో పోసి , ఫ్రీజర్లో 6,7 గంటలపాటు ఉంచి , తర్వాత సర్వ్ చేయాలి .