Kobbari Milk Pooding: కొబ్బరి పాలు పూడింగ్ తయారీ విధానం
కొబ్బరి పాలు పూడింగ్ తయారీ విధానం:
కావలిసినవి:
- కొబ్బరి కాయలు 2
- బియ్యం 100 గ్రాములు
- పాలు 1 లీటర్
- నెయ్యి 1 కప్పు
- కిస్స్మిస్స్ 10 గ్రాములు
- జీడిపప్పు 10 గ్రాములు
తయారీ విధానం:
- కొబ్బరి తురిమి ఒక పల్చటి గుడ్డ లో వడగట్టి పాలు తీయాలి.
- తరువాత మంచి నీళ్లలో కలిపి పల్చగా కొబ్బయిర్ పాలు తీయాలి. రెండు విడివిడిగా గిన్నెలో ఉంచుకోవాలి.
- పల్చగా ఉన్న కొబ్బరి పాలలో అన్నం వండుకోవాలి, మూడోవ వంతు ఉడికిన తరువాత చిక్కగా ఉన్న కొబ్బరిపాలు పోసి అన్నం మెత్తగా అయ్యేంతవరకు వండాలి.
- మాములు పాలు పోసి మరల వండాలి. పాలు అన్నం బాగా కలిపి ఉడికిన తరువాత బెల్లం తరిగి వేయాలి.
- మొత్తం బాగా ఉడికిన తరువాత దించి యలికలు పొడి,జీడిపప్పు, వేసి కిస్స్మిస్ కూడా చల్లి, చల్లార్చిన తరువాత సర్వ్ చేసుకోవాలి.
Kobbari Milk Pooding: కొబ్బరి పాలు పూడింగ్ తయారీ విధానం
Reviewed by Lucky
on
March 15, 2025
Rating: 5