Paneer Ice Cream Method of preparation Recipe
పనీర్ ఐస్ క్రీమ్ కావలిసినవి:
పాలు 6 కప్పులు
నీరు 1/2 కప్పు
పనీర్ 2 కప్పులు
బాదంపప్పు 1/4 కప్పు
పంచదార 3/4 కప్పు
జొన్నపిండి 1 స్పూన్
పిస్తా 1/4 కప్పు
తయారీ విధానం:
జొన్నపిండి 1/2 కప్పు పాలలో కలిపి ఉంచుకోవాలి.
మిగిలిన పాలు బాగా కాచాలి. కొంచెం మందంగా అయినా తరువాత జొన్న పిండి కలిపినా పాలు పోసి కలియబెడుతూ 5 నిముషాలు స్టవ్ మీద ఉంచాలి.
నీరు పంచదార కలిపి తీగపాకం పట్టుకోవాలి.
తరిగిన పనీరును పాకంలో కలిపి ఉంచాలి.
పాలు కూడా పనీర్ లో కలిపి 5 నిముషాలు స్టవ్ మీద ఉంచాలి.
ఉడికిన ఐస్ క్రీమ్ దించి,బాదంపప్పు, పిస్తా వేసి, చల్లారిన తరువాత 8 గంటలు పాటు డీప్ ఫ్రీజ్ లో ఉంచాలి.
పనీర్ తయారు చేయుట :
2 లీటర్లు ఆవుపాలు, సిట్రిక్ ఆసిడ్ 1/2 స్పూన్ నీరు 1 టీ కప్పు పాలు కాచిన తరువాత సిట్రిక్ ఆసిడ్న ఒక కప్పు వేడినీళ్లలో కలిపి నెమ్మదిగా పాలలో కలపాలి. 15 నిముషాలు తరువాత విరిగిన పాలను ఒక మెత్తటి బట్టతో నీరు ఊడ్చాలి. బట్టలో మిగిలిన మిశ్రమమే పనీర్.