vanilla ice cream method of preparation recipe
వెనీలా ఐస్ క్రీమ్
కావాలిసినవి:
పాలు ఒకటిన్నర కప్పు
ఉప్పు చిటికెడు
పాల మీగడ ఒకటిన్నర కప్పు
పంచదార 3/4 కప్పు
మైదాపిండి ఒకటిన్నర స్పూన్
వెనీలా లెసెన్స్ 1/2 స్పూన్
తయారీ చేయు విధానం:
మైదాపిండి 2 స్పూన్లు పాలలో కలిపి, పేస్టులా తయారుచేసి ఉంచుకోవాలి.
మిగిలిన పాలు బాగా కాగిన తరువాత, మైదాపిండి పేస్టు,ఉప్పు, పంచదార వేసి గరిటతో కలియాబెడుతూ సన్నని సెగపై ఉంచాలి.
బాగా ఉడికి, మందంగా అయిన తరువాత దించి, చల్లార్చి ఒక ట్రయిలో పోసి ప్రిజర్ లో 4 నుండి 5 గంటలు వుంచాలి
4 నుండి 5 గంటలు తరువాత ఐస్ క్రీమ్ గిన్నెలో పోసి మజ్జిగ కవ్వంతో కానీ ఎగ్ బీటర్ తో గాని చిలకాలి. లెసైన్స్, మీగడ కలిపి మరల ట్రై లో వాక్స్ పేపర్ చేసి ఐస్ క్రీమ్ పోసి, ప్రిజర్ లో పెట్టాలి.
ఐస్ క్రిమ్ గట్టిగా ఓ మాదిరిగా అయినా తరువాత సెర్వేచేయాలి.
vanilla ice cream method of preparation recipe
Reviewed by Lucky
on
March 01, 2025
Rating: 5